NTV Telugu Site icon

Fake Bomb Threats: నకిలీ బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌కి కేంద్రం వార్నింగ్..

Fake Bomb Threats

Fake Bomb Threats

Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్‌తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.

Read Also: IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!

తాజాగా ఈ నకిలీ బెదిరింపులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ని హెచ్చరించింది. శుక్రవారం ఒక సలహాలో.. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బూటకపు బాంబు బెదిరింపుల కారణంగా విమాన ప్రయాణికులు మరియు భద్రతా ఏజెన్సీలు ప్రభావితమయ్యాయని, ఇది విమానయాన సంస్థల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని పేర్కొంది. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు, పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభావితం చేస్తున్నప్పుడు, దేశ ఆర్థిక భద్రతను కూడా అస్థిరపరుస్తాయని చెప్పింది.

ఈ నకిలీ బాంబు బెదిరింపుల మేసేజ్‌లను సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్, రీషేరింగ్, రీపోస్టింగ్, రీట్వీటింగ్ చేస్తున్నట్లు గమనించామని కేంద్రం చెప్పింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు పబ్లిక్ ఆర్డర్, ఎయిర్ లైన్స్ సేవలు, విమానయాన ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పింది. పబ్లిక్ ఆర్డర్ మరియు సెక్యూరిటీని ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT చట్టం), 2000 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (IT రూల్స్), 2021 ప్రకారం తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్లాట్‌ఫారమ్‌లకు ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది. అటువంటి “చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు” సమాచారాన్ని పోస్ట్ చేయడం మరియు భాగస్వామ్యం చేయడాన్ని ఆపాలని ప్లాట్‌ఫారమ్‌లను కోరింది