Site icon NTV Telugu

Supreme Court: రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏం సమాధానమిచ్చిందంటే..!

Supremecourt

Supremecourt

చట్టసభల్లో ఆమోదింపబడిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని సుప్రీంకోర్టు గతంలో ధర్మాసనం ఆదేశించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నరు ఆర్‌.ఎన్‌.రవి ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. అనంతరం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గడువు విధింపుపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ఇది కూడా చదవండి: Shubhanshu Shukla: రేపు భారత్‌‌కు రానున్న వ్యోమగామి శుభాంశు శుక్లా

తాజాగా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్‌ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లులపై గవర్నర్లు అంగీకారం తెలిపే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. గడువు విధించడం వల్ల రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని కేంద్రం తెలిపింది. విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే అనవసరమైన న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజ్యాంగపరమైన యంత్రాంగాల ద్వారా సరిదిద్దాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Putin-Trump: పుతిన్‌ ఎదుట బీ-2 బాంబర్లు ప్రదర్శన.. దేని కోసం..!

Exit mobile version