Site icon NTV Telugu

Kiren Rijiju Letter: కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధుల్ని చేర్చుకోండి.. కిరణ్ రిజిజు లేఖ

Kiren Rijuji Open Letter

Kiren Rijuji Open Letter

Centre Wants Its Representatives In Judges Appointments Panel: సుప్రీంకోర్టులో న్యాయమూర్తం నియామకాల విషయంపై కొంతకాలం నుంచి అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ కీలక పరిణామానికి తెరలేపారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధుల్ని చేర్చుకోవాల్సిందిగా కోరుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌‌కు కిరణ్ రిజిజు లేఖ రాశారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని.. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Project K: చేతులు, కాళ్లు కాదండి కాస్త మొహం చూపించండి గురువు గారు

కాగా.. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపింది. ఆ సమయంలో.. ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లుగా ఇటీవల కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక అప్పటినుంచి కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. 2014లో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌‌ని కొట్టేయడం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని విమర్శించారు. ఆ విమర్శతో ఈ వివాదం మరింత ముదిరింది. అందుకు సుప్రీంకోర్టు కూడా గట్టిగానే బదులిచ్చింది. కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా.. సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే.. దాన్ని ఎవ్వరూ నిరోధించరని పేర్కొంది. అయితే.. ఆలోపు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిందేనని ఉద్ఘాటించింది.

Ram Charan: లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన మెగాపవర్ స్టార్…

ఇంతకీ కొలీజియం అంటే ఏమిటి? సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలతో పాటు ఒక ప్రధాన న్యాయమూర్తిని కలిపి కొలీజియం అంటారు. ఈ కొలీజియం వ్యవస్థ సిఫార్సుల జడ్జీల నియామకం, బదిలీలు జరుగుతాయి. తన సిఫారసులను కొలీజియం తొలుత ప్రభుత్వానికి పంపిస్తుంది. ప్రభుత్వం దాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల అయ్యాక.. జడ్జీలు నియమితులవుతారు. అయితే.. ఈసారి జస్టిస్ జోసెఫ్ నియామకం విషయంలో పునరాలోచించాలని కోరుతూ.. కొలీజియం సిపార్సును మోడీ ప్రభుత్వం తిరిగి వెనక్కు పంపింది.

Exit mobile version