NTV Telugu Site icon

Bullet Trains: భారతదేశం అంతటా “బుల్లెట్ ట్రైన్స్”.. త్వరలో కేంద్రం అధ్యయనం..

Bullet Trains

Bullet Trains

Bullet Trains: భారతదేశంలో ‘‘బుల్లెట్ ట్రైన్’’ వ్యవస్థను విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అహ్మాదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చకచక జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ మార్గం నిర్మితమవుతున్న నేపథ్యంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో హైస్పీడ్ ట్రైన్ కారిడార్‌ల కోసం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ రోజు పార్లమెంట్ ఉభయసభల ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.

Read Also: Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..!

అహ్మదాబాద్ మరియు ముంబై మధ్య హై-స్పీడ్ రైల్ ఎకోసిస్టమ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. అహ్మదాబాద్-ముంబై మధ్య 508 కి.మీ హైస్పీడ్ కారిడార్ దేశంలో మొదటిది. ఈ మార్గంలో గంటకు 320 కి.మీ వేగంతో రెండు గంటల్లో రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుతు తీయనుంది. సూరత్, వడోదర వంటి పరిమిత స్టాపుల్లో బుల్లెట్ ట్రైన్‌ హాల్టింగ్ ఉండనుంది. భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థను ప్రపంచంలో అత్యుత్తమంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్రపతి చెప్పారు. 10 ఏళ్లలో 21 నగరాలకు మెట్రో రైల్ సదుపాయాలు చేరుకున్నాయని, వందే మెట్రో వంటి అనేక పథకాల పనులు జరుగుతున్నాయని అన్నారు.