Centre To Extend Free Ration Scheme By Three More Months: కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొడగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని అందించేందకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ పథకం కింద పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించబడుతున్నాయి. ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తున్న తరుణంలో మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని పొడగించబోతోంది కేంద్రం. వచ్చే పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: Asaduddin Owaisi: పీఎఫ్‌ఐని నిషేధించారు.. మరి వారి సంగతి..?
డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతోన్న తరుణంలో దీన్ని కోసమే కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాలు పొడగించుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పథకం పొడగింపు వల్ల జాతీయ దేశ ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అయితే అదనపు ఆర్థిక భారం దృష్ట్యా ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించాలని భావించినప్పటికీ.. కేంద్రం మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే పథకాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న సబ్సిడీల కారణంగా.. ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తే ఖనానాపై భారం పడుతుందని ఆర్థిక మంత్విత్వ శాఖ తెలిపింది. గత రెండేళ్లుగా ఈ పథకం కింద రూ. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేశారు. మార్చి 2020లో కోవిడ్-19 మహ్మమారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. అప్పటి నుంచి ప్రతీ వ్యక్తికి నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల ఆహారధాన్యాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన( పీఎం-జీకేఏవై) పథకం కింద అందిస్తోంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారు.