GST: ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుంది. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించం లేదా ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న అనేక వస్తువులను దిగువన 5 శాతంలోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తోంది.
ఈ అరేంజ్మెంట్ మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్‌పేస్ట్, టూత్ పౌడర్, డుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు మరియు వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్‌లు, గీజర్‌లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ. 1,000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500 నుండి రూ. 1,000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్పులు అమలు చేయబడితే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరలకు వస్తాయి. మరోవైపు, ప్రభుత్వం సరళీకృతమైన, సులభంగా పాటించే జీఎస్టీని కూడా పరిశీలిస్తోంది.
అయితే, ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు భారాన్ని మోపుతుందని తెలుస్తోంది. అయితే, వినియోగం పెరిగితే జీఎస్టీ వసూల్లు పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు, కేంద్రం ఈ చర్యలకు ఒప్పుకున్నా రాష్ట్రాలు ఏ విధంగా భావిస్తాయనేది చూడాలి. GST కింద, రేటు మార్పులకు GST కౌన్సిల్ నుండి ఆమోదం అవసరం. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ చరిత్రలో ఒకసారి మాత్రమే ఓటింగ్ జరిగింది. ప్రతీ నిర్ణయం కూడా ఏకాభిప్రాయం ప్రకారమే తీసుకుంది. ఈ నెల చివర్లో జరిగే 56వ GST కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు.
Read Also: Air India Plane Crash: రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా..? ఫ్లైట్ సిమ్యులేషన్‌లో కీలక ఫలితాలు..
12 శాతం జీఎస్టీ స్లాబ్ కింద ఉపయోగించే వస్తువులు:
*టూత్ పౌడర్
*శానిటరీ నాప్‌కిన్‌లు హెయిర్ ఆయిల్
* సబ్బులు (కొన్ని వర్గాలు, మరికొన్ని 18 శాతం)
* టూత్‌పేస్ట్ (కొన్ని బ్రాండెడ్ వేరియంట్‌లు 12 శాతం, మరికొన్ని 18 శాతం)
* గొడుగులు
* కుట్టు యంత్రాలు
* వాటర్ ఫిల్టర్లు , ప్యూరిఫైయర్లు (విద్యుత్ రహిత రకాలు)
* ప్రెజర్ కుక్కర్లు
* అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేసిన వంటసామాను, పాత్రలు (కొన్ని 12 శాతం)
* ఎలక్ట్రిక్ ఐరన్లు
* వాటర్ హీటర్లు (గీజర్లు)
* వాక్యూమ్ క్లీనర్లు (తక్కువ సామర్థ్యం, నాన్ కమర్షియల్)
* వాషింగ్ మెషీన్లు (లో కెపాసిటీ)
* సైకిళ్లు
* వికలాంగుల కోసం క్యారేజీలు
* ప్రజా రవాణా వాహనాలు (విక్రయించినప్పుడు)
* రెడీమేడ్ దుస్తులు (రూ. 1,000 కంటే ఎక్కువ ధర) పాదరక్షలు రూ. 500-రూ. 1,000 మధ్య
* చాలా వరకు టీకాలు
* HIV, హెపటైటిస్, TB లకు సంబంధించిన రోగ నిర్ధారణ కిట్లు
* కొన్ని ఆయుర్వేద మరియు యునాని మందులు
* ఎక్సర్‌సైజ్ పుస్తకాలు
* జియోమెట్రీ బాక్సులు
* డ్రాయింగ్ మరియు కలరింగ్ పుస్తకాలు
* మ్యాప్‌లు మరియు గ్లోబ్‌లు
* గ్లేజ్డ్ టైల్స్ (బేసిక్, నాన్-లగ్జరీ వేరియంట్‌లు)
* రెడీ-మిక్స్ కాంక్రీట్
* ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ భవనాలు
* మెకానికల్ థ్రెషర్‌ల వంటి వ్యవసాయ పరికరాలు
* కండెన్స్‌డ్ మిల్క్, ఫ్రోజెన్ కూరగాయలు (కొన్ని వేరియంట్‌లు) వంటి ప్యాక్ చేసిన ఆహారాలు
* సోలార్ వాటర్ హీటర్లు
