Site icon NTV Telugu

Service Calls: సేవలు, లావాదేవీ కాల్స్ కోసం కొత్త మొబైల్ సిరీస్‌ని ప్రారంభించిన కేంద్రం..

Mobile

Mobile

Service Calls: దేశ ప్రజలు చట్టబద్ధమైన కాల్స్‌ని సులభంగా గుర్తించేందుకు కేంద్రం 10-అంకెల కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ని ప్రారంభించింది. టెలిమార్కెటర్ల నుంచి అయాచిత కాల్స్ గుర్తించేదుకు ఈ నిర్ణయం సహాయపడనుంది. సేవలు లేదా లావాదేవీలకు సంబంధించి కాల్స్ చేయడానికి ‘‘160xxxxxxx’’ అనే కొత్త నంబరింగ్ సిరీస్‌ను కేంద్రం గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయోషనల్/సర్వీస్/ లావాదేవీ వాయిస్ కాల్స్ చేయడానికి టెలిమార్కెటర్లకు ‘‘140xxxxxx’’ సిరీస్ కేటాయించబడింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DoT) ప్రకారం..‘‘140xx’’ సిరీస్‌ను ప్రమోషనల్ కాల్‌ల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నందున, వినియోగదారులు సాధారణంగా అలాంటి కాల్‌లకు ప్రతిస్పందించరు మరియు అనేక ముఖ్యమైన సర్వీస్/లావాదేవీ కాల్‌లు మిస్ అవుతున్నాయి అని పేర్కొంది.

Read Also: Madhya Pradesh High Court: ముస్లిం యువకుడితో, హిందూ యువతి వివాహం చెల్లదు..

సర్వీస్/లావాదేవీ కాల్స్ చేయడానికి నిజమైన సంస్థలు సాధారణ 10- అంకెల నంబర్‌ని విస్తృతంగా ఉపయోగించుకునేలా చేసింది. అయితే అదే సమయంలో ఈ 10-అంకెల నంబర్‌ని ఉపయోగించి మోసగాళ్లు వినియోగదారుల్ని మోసం చేసే అవకాశం ఇచ్చిందని DoT చెప్పింది. దీన్ని పరిష్కరించడానికి కొత్త నంబరింగ్ సిరీస్ కేటాయించడం జరిగింది.

160xxxxxxx ఇది ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఎంటిటీల ద్వారా సర్వీస్/లావాదేవీ వాయిస్ కాల్‌ల కోసం ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏ, ఐఆర్డీఏ వంటి ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే సర్వీస్/లావాదేవీ కాల్స్‌లకు ఇకపై 1601 నుంచి ప్రారంభమవుతాయని డీఓటీ చెప్పింది.

Exit mobile version