NTV Telugu Site icon

Sikhs For Justice: ఖలిస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’’పై మరో 5 ఏళ్లు బ్యాన్..

Sikhs For Justice

Sikhs For Justice

Sikhs For Justice: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూకి చెందిన ఉగ్రసంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’(ఎస్‌జేఎఫ్)పై కేంద్రం మరో 5 ఏళ్లు బ్యాన్ పొడగించింది. చట్టవిరుద్ద కార్యకలాపాలు(నివారణ)చట్టం(UAPA) కింద ఖలిస్తానీ అనుకూల సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం మంగళవారం తెలిపింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జరిపిన విచారనలో లభించిన కొత్త సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Bhogapuram Airport: ఏది ఏమైనా 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి..

జూలై 1,2020లో భారత ప్రభుత్వం పన్నూని టెర్రరిస్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ ఈ దేశాల్లో సిక్కు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కెనడా వేదికగా పలు భారత వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ఎన్ఐఏ అర డజనుకు పైగా కేసులు నమోదు చేసింది. గతేడాది పంజాబ్, చండీగఢ్‌లోని అతని ఆస్తుల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు, ఖలిస్తాన్ని బహిరంగంగా సమర్థిస్తూ, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాల్ చేసినందుకు జూలై 2019లో ‘సిక్స్ ఫర్ జస్టిస్’పై కేంద్రం నిషేధం విధించింది.