విజృంభిస్తోన్న కొత్త వేరియంట్… పది రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోతున్నాయ్. ఒమిక్రాన్ పాజిటివ్‌లు…450కి చేరువయ్యాయ్. రిస్క్ దేశాల నుంచే కాకుండా…నాన్ రిస్స్‌దేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఒమిక్రాన్ బయటపడుతోంది. మరోవైపు పదిరాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకగా.. 450కి చేరువయ్యాయ్. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాజస్థాన్‌లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఒమిక్రాన్, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరం, కర్ణాటక, బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3 నుంచి 5 రోజుల పాటు ఉండనున్నాయి. కొవిడ్ పరీక్షలు, కరోనా నిబంధనల అమలు వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేయనున్నాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్ వృద్ధి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నాయ్.
వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా…వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అసోం ప్రభుత్వం…రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటికే హర్యానా, యూపీ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయ్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..