NTV Telugu Site icon

BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్లను బ్లాక్ చేసిన కేంద్రం..

Pm Modi

Pm Modi

BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దేశంతో పాటు బ్రిటన్ లో కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ.. బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’అనే పేరుతో రెండు భాగాల సిరీస్ రూపొందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. దీన్ని వలసవాద మనస్తత్వంగా, తప్పుడు ప్రచారంగా భారత విదేశాంగ శాఖ విమర్శించింది. దీనిపై బ్రిటన్ పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ హుస్సెన్ గుజరాత్ అల్లర్లకు మోదీనే బాధ్యుడని నిందిచాడు. అయితే దీన్ని యూకే ప్రధాని రిషి సునాక్ తీవ్రంగా తప్పుపట్టారు. వ్యక్తిగతంగా ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడకూడదని సూచించాడు.

Read Also: India-China Border: చైనా బోర్డర్‌‌లో ఇండియా భారీ సైనిక విన్యాసాలు.. జిన్‌పింగ్ వ్యాఖ్యలతో అలర్ట్

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో ప్రధానిని విమర్శిస్తూ చేసిన ఈ బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేస్తున్న ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ డ్యాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో లింకులను తీసేయాలని ట్విట్టర్, యూట్యూబులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇవేవీ పట్టించుకోకుండా బ్రిటిష్ మీడియా బీబీసీ ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ఈ డ్యాక్యుమెంటరీని షేర్ చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.