NTV Telugu Site icon

MSP: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు..

Msp

Msp

MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి, రాగి, మొక్కజొన్న, జొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరి కనీస మద్దతు ధరను రూ. 117 పెంచినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ మద్దతు ధర పెంపుతో క్వింటా వరి ధర రూ. 2300కి చేరుతుంది. పంటల ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు ఎంఎస్‌పీని కేంద్రం ఆమోదించింది. నూనెగింజలు, పప్పుధాన్యాలకు అత్యధికంగా మద్దతు ధరను పెంచారు.

Read Also: Earth Core: భూమి అంతర్గత కోర్ భ్రమణ వేగం తగ్గింది.. ఎలాంటి ప్రభావం ఉండబోతోంది..?

కొత్త ధరల ప్రకారం క్వింటాల్‌కి.. కందిపప్పుకు రూ. 7500, మినుములకు రూ. 7400, పెసరకు రూ. 8682, వేరు శనిగకు రూ. 6783, పత్తికి రూ. 7121, జొన్నకు రూ. 3371గా ఉంది. తాజా నిర్ణయంతో రైతులు దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల ఎంఎస్‌పీ అదనంగా లభిస్తుందని, గత సీజన్‌తో పోలిస్తే ఇది రూ. 35,000 ఎక్కువ అని మంత్రి చెప్పారు. ఇదే విధంగా క్వింటా చొప్పున రాగులకు రూ. 4,290, సజ్జలకు రూ. 2,625, మొక్కజొన్న రూ.2,225 వద్ద రేట్లను నిర్ణయించారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.