NTV Telugu Site icon

Drinking Alcohol: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆల్కహాల్ తాగేవాళ్లకు అమ్మాయిలను ఇవ్వకండి

Alcohol Persons

Alcohol Persons

Drinking Alcohol: ఆల్కహాల్‌కు బానిసైన వాళ్లు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అటు కొంతమంది కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తికి అమ్మాయిలను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని చెప్పారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని.. ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని… ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. కానీ, మళ్లీ తాగడాన్ని ప్రారంభించాడని, చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు.

Read Also: Team India: శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ అనుమానం

మద్యానికి బానిసై తన కుమారుడు చనిపోయిన చేదు సంఘటనను గుర్తు చేసుకుంటూ కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు చనిపోయేటప్పుడు తన మనవడికి రెండేళ్ల వయసు మాత్రమేనని వివరించారు. అతడి భార్య ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదని చెప్పారు. ఇలాంటి పరిస్థితి నుంచి మీ కూతుర్లని, అక్కచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 20 లక్షల మంది మరణిస్తున్నాని చెప్పారు. మద్యానికి అలవాటైన వారి జీవిత కాలం చాలా తక్కువని అన్నారు. 80 శాతం క్యాన్సర్ మరణాలకు.. పొగాకు, సిగరెట్లు, బీడీలు కాల్చే అలవాటే కారణమని తెలిపారు. పాఠశాలల్లో సైతం దీనిపై అవగాహన కల్పించాలని చెప్పారు.

Show comments