Site icon NTV Telugu

Union cabinate: నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ

Central Cabinet

Central Cabinet

Union cabinate: ఢిల్లీలో ఈరోజు (డిసెంబర్ 12) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఒకే దేశం.. ఒకే ఎన్నిక డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ కొనసాగుతున్న వేళ మంత్రి వర్గా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎలాటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

Read Also: Manchu Vishnu: మంచు విష్ణుకు పోలీసులు వార్నింగ్?

కాగా, గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ పాన్ 2.0కి ఆమోదం లభించింది. కనెక్టివిటీకి సంబంధించిన మూడు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, అక్టోబర్ 3వ తేదీన మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే, ప్రస్తుతం జరిగే కేబినెట్ మీటింగ్‌లోనూ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version