NTV Telugu Site icon

Central Cabinet Decisions: వ్యవసాయానికి టెక్నాలజీ జోడింపు.. రైతాంగం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

Cabinet

Cabinet

Central Cabinet Decisions: ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతాంగం కోసం రూ.13,966 కోట్లను కేంద్రం కేటాయించింది. రూ. 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తూ రైతులకు మరింత మేలు చేయాలని కేంద్రం భావిస్తోంది. భవిష్యత్తులో రైతులు లోన్ తీసుకోవడం కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

రూ. 3979 కోట్లతో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం క్రాప్ సైన్స్ ఏర్పాటు చేయనున్నారు. 2047 నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంటను పండించేలా రైతులు సిద్ధం చేయనున్నారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మరింత బలోపేతం చేసేందుకు రూ. 2291 కోట్లతో ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరిశోధనలు జరగనున్నాయి. రూ. 1702 కోట్లతో పశువులు వాటి ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులపై ఫోకస్ చేయనున్నారు.

Read Also: Chiru – Balayya: సమరసింహారెడ్డి విత్ ఇంద్రసేనా రెడ్డి.. బాక్స్ ఆఫీస్ కి ఇన్సూరెన్స్ లు చేయించుకోలమ్మా!

రూ. 860 కోట్లతో హార్టికల్చర్ అభివృద్ధి కోసం కేటాయించారు. దీని ద్వారా రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచనున్నారు. కృషి విజ్ఞాన్ కేంద్ర అభివృద్ధి కోసం రూ. 1,202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం రూ.1,115 కోట్ల రూపాయల కేటాయించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందడి.

ఇదిలా ఉంటే రూ.18,036 కోట్ల రూపాయలతో 309 కిలోమీటర్ల మన్మాడ్- ఇండోర్ కొత్త మార్గ నిర్మాణం కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ద్వారా ఇతర రంగాలపై కూడా మంచి ఫలితాలు ఉంటాయని కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు నాలుగు ప్రాజెక్టులకు అనుమతి లభించింది. వచ్చే ఏడాది మధ్యలో మొదటి ప్రాజెక్ట్ రెడీ కానుంది. సెమి కండక్టర్ ఇండస్ట్రీ మెరుగైన ఫలితాలను ఇవ్వబోతోంది.

Show comments