NTV Telugu Site icon

Delhi: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలు కేటాయించిన కేంద్రం

Ashwinivishnu

Ashwinivishnu

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏపీలోని చిత్తూరు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, గుంటూరు, కృష్ణ, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

ఇది కూడా చదవండి: Palm Oil: పామ్ ఆయిల్ వాడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే అస్సలు వాడరు

దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. అలాగే హర్యాణాకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వీలుగా రిథాల-కుండ్లీ మధ్య 26.46 కి.మీ మేర ఢిల్లీ మెట్రో విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar Reddy: అబ్బా.. అలా ఎలా రివర్స్ స్కూప్ షాట్ కొట్టావు నితీష్ (వీడియో)