Site icon NTV Telugu

Delhi: పిల్లల దగ్గు సిరప్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల

Cough Syrup For Children

Cough Syrup For Children

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఇటీవల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి దగ్గు సిరప్‌లే కారణం అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు దగ్గు సిరప్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింది.

మార్గదర్శకాలు…
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదు.

ఐదేళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ మందుల వినియోగం సురక్షితం కాదని.. ప్రభావవంతం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఐదేళ్లకు పైబడిన పిల్లల్లో మాత్రం క్లినికల్ ఈ-వాల్యుయేషన్ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో కచ్చితమైన డోసింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే దగ్గు సిరప్ వాడాలి.

ఎక్కువ ఔషద మిశ్రమాలు ఇవ్వడం వల్ల అనవసరమైన ప్రమాదాలు తలెత్తే అవకాశముందని హెచ్చరిక.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ఫార్మాసిస్టులు ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇది కూడా చదవండి: Shocking: అల్లరి చేస్తుందని హత్య.. మాదన్నపేటలో బాలిక హత్య కేసులో సంచలనం..

Exit mobile version