NTV Telugu Site icon

Cement Prices: 5 ఏళ్ల కనిష్టానికి సిమెంట్ ధరలు.. కారణం ఇదే…

Cement Prices

Cement Prices

Cement Prices: సిమెంట్ ధరలు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు యెస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. ఈ సెక్టార్‌లో తీవ్రమైన పోటీ కారణంగా సిమెంట్ ధరలు కనిష్టానికి పడిపోయినట్లుగా చెప్పాయి. ఇటీవల త్రైమాసికాల్లో ధరలు పెంచడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ పెరుగుదలపై వెనక్కి తగ్గాయని నివేదిక పేర్కొంది. బలహీనమైన మార్కెట్ పరిణామాలు, డిమాండ్‌ని తగ్గించాయని వెల్లడించింది.

Read Also: IND vs AUS: అడిలైడ్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!

‘‘తీవ్రమైన పోటీ బలహీనమైన ధరలకు కారణమైంది. సిమెంట్ ధరలు ప్రస్తుతం 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సమీప కాలంలో గణనీయమైన ధరల పెంపుని ఆశించలేము.’’ అని నివేదిక వెల్లడించింది. సిమెంట్ తయారీదారుల మధ్య తీవ్రమైన పోటీ ధరల ఒత్తిడికి దారి తీశాయని, పరిశ్రమ సిమెంట్ ధరల పెరుగుదలను కొనసాగించలేకపోయిందని నివేదిక పేర్కొంది. డిమాండ్ మెరుగయ్యే వరకు ధరల పెంపు ఉండదని, సమీప కాలంలో పరిస్థితి ఇలానే ఉంటుందని నివేదిక పేర్కొంది.

2026 ఆర్థిక సంవత్సరం మధ్య నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీనికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో పెరుగుదల, గ్రామీణ మరియు పట్టణ గృహాల పునరుద్ధరణ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల పెరుగుదల వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ తగ్గొచ్చని నివేదిక అంచనా వేసింది.