Site icon NTV Telugu

10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు.. సీబీఎస్‌ఈ నిర్ణయం

students

10వ తరగతి, 12వ తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాలని 10వ తరగతి మరియు 12వ తరగతి రెగ్యులర్‌ విద్యార్థులను పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ.. 10, 12వ తరగతులకు చెందిన ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది… ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ మధ్య వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.. ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ లేవు… వారి రిజల్ట్స్ ప్రకటించాలి అంటే పరీక్షలు తప్ప మరో మార్గం లేదని తన ప్రకటనలో పేర్కొంది సీబీఎస్‌ఈ.

Exit mobile version