Site icon NTV Telugu

CBSE Results: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఈ లింక్ చూడండి..!!

Cbse Results

Cbse Results

CBSE 10th class Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలను అధికారులు ఈరోజు విడుదల చేశారు. కొన్నిరోజులుగా ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. https://cbseresults.nic.in సైట్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టినతేదీ, స్కూల్ నంబర్లతో ఫలితాలను పొందవచ్చు. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరిగాయి. 7,046 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించగా దేశవ్యాప్తంగా 21.16 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు రాసిన వారిలో 8.94లక్షల మంది బాలికలు, 12.21 లక్షల మంది బాలురు ఉన్నారు.

Read Also: Corona Cases are Increasing Again: గురుకుల విద్యార్థులపై కరోనా పంజా.. 15 మందికి పాజిటివ్‌

మరోవైపు ఈరోజు ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. సీబీఎస్ఈ బోర్డు అందించిన సమాచారం ప్రకారం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 94.54 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.25 శాతంగా ఉంది. ఉత్తీర్ణతలో కేరళ టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 98.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు

Exit mobile version