Site icon NTV Telugu

CBI’s Operation Meghchakra: పిల్లల లైంగిక దోపిడి కేసుపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

Cbi Pan India Raids

Cbi Pan India Raids

CBI raids in child pornography case: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టికేషన్(సీబీఐ) దేశవ్యాప్తంగా భారీగా దాడులు చేసింది. పిల్లల లైంగిక దోపిడికి సంబంధించిన కేసులో 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 56 ప్రదేశాలపై దాడులు చేశారు. పిల్లలకు సంబంధించిన లైంగిక మెటీరియర్ ను సర్య్కులేట్ చేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సీబీఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. న్యూజిలాంట్ లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగపూర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ

ఆన్ లైన్ లో లభ్యమయ్యే అబ్యూసుడ్ మెటీరియల్ కు సంబంధించి, ఇందులో ప్రధానంగా ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ పెద్ద ఎత్తన ఆపరేషన్ నిర్వహించింది. ‘ఆపరేషన్ మేఘ్ చక్ర’ పేరుతో సీబీఐ ఈ దాడులను చేసింది. ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ వ్యాప్తి చేసే వ్యక్తులు, ముఠాలను గుర్తించడంతో పాటు వారిని పట్టుకునేందుక సీబీఐ ఈ ఆపరేషన్ లాంచ్ చేసింది. దీంతోపాటు లైంగికంగా, శారీరకంగా మైనర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. మైనర్ల అక్రమ లైంగిక కార్యకలాపాలను ఆడియో, వీడియోలను ప్రసారం చేయడానికి పెడ్లర్లు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ జరిగింది.

ఇటీవల ఎన్ఐఏ, ఈడీ పీఎఫ్ఐ సంస్థపై దాడులు చేసిన విధంగానే ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ‘‘ఆపరేషన్ కార్బన్’’పేరుతో పిల్లల అశ్లీల విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని గతేడాది సీబీఐ పెద్ద ఆపరేషన్ నిర్వహించింది. దీనికి కొనసాగింపుగానే తాజా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గత వారం సుప్రీంకోర్టు పిల్లల అశ్లీల ప్రసారానికి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాంగంపై వివరణాత్మక నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.

Exit mobile version