Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ పీజీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. కోల్‌కతాలో డాక్టర్ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారణ జరుపుతోంది. నిందితుడు సంజయ్ రాయ్, డాక్టర్ సెమినార్ హాల్‌లో నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కేసులో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) యువనేత ఆశిష్ గుప్తాకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్, మెసేజ్ డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: Work Culture :ఆఫీసు నుంచి పని చేయడం మంచిదా? ఇంట్లోంచి వర్క్ చేయడం బెటరా?: తాజా నివేదిక
పాండే మొబైల్ ఫోన్‌లో కాల్స్, మెసేజ్ డేటాను నిర్ణీత సమయంలో కొన్ని ఆధారాలను తొలగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో డేటాను రిట్రీవ్ చేయాలని భావిస్తున్నారు. ఒకసారి ఈ డేటా ఏంటనే విషయాలు తెలిస్తే, దీంట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సీబీఐ భావిస్తోంది. ఆశిష్ పాండేకి, మాజీ ఆర్‌జీ కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సందీప్ ఘోష్ విశ్వసనీయుల్లో ఇతను ఒకరు.
మొబైల్ ఫోన్‌లోని వివరాలు తెలిస్తే, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యాచారం, హత్య కేసుతో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆశిష్ పాండే డిలీట్ చేసిన కాల్స్, మెసేజెస్‌లు ప్రధానంగా సందీప్ ఘోష్‌కి సంబంధించినవి ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ అభిజిత్ మోండల్‌పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం-హత్య కేసు విచారణలో అలసత్వం ప్రదర్శించి, కేసు వివరాలను తారుమారు చేయాలని భావించాడు. ఆర్థిక అవకతవకల కేసులో పాండేను అక్టోబర్ 3న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.