Site icon NTV Telugu

CBI: అవినీతి కేసు.. సీబీఐ కస్టడీకి మాజీ హోంమంత్రి..

Anil Deshmukh

Anil Deshmukh

అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా అవినీతి కేసులో సీబీఐ అనిల్‌ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేయగా.. ఇక, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది సీబీఐ… అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ను.. త‌మ క‌స్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసుకున్న ద‌ర‌ఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్ధానం అనుమతించగా.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సంబంధించి సీబీఐ తనను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ దేశ్‌ముఖ్ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, బాంబే హైకోర్టు ఆ పిటిష‌న్‌ను తిర‌స్కరించింది. అనిల్ దేశ్‌ముఖ్ ఉద్దేశ‌పూర్వకంగానే క‌స్టడీని త‌ప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ వాదించింది.. దీంతో.. జైలు నుంచి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ని కస్టడీలోకి తీసుకుంది సీబీఐ.

Read Also: Telangana: గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్‌లో కీలక మార్పులు..!

Exit mobile version