Site icon NTV Telugu

Tejashwi Yadav: తేజస్వీ యాదవ్‌కు జైలు తప్పదా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్

Tejaswi Yadav

Tejaswi Yadav

CBI petition to cancel Tejaswi Yadav’s bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.

ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో 2006లో రాంచీ, ఒడిశాలోని పూరిలలోని రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ ఒప్పందాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే క్రమంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే తేజస్వీ యాదవ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసి అతని స్పందన కోరింది.

Read Also: PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీని తెగ పొగిడిన అమెరికా మీడియా..

ఈ కేసుపై గత నెలలో తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. సీబీఐ అధికారులకు తల్లి, పిల్లలు లేరా..? వారికి కుటుంబం లేదా..? వారు ఎప్పుడూ సీబీఐ అధికారులుగానే ఉంటారా..? పదవీ విరమణ చేయరా..? బీజేపీ మాత్రమే ఎప్పుడూ అధికారంలో ఉంటుందా..? మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారు..? రాజ్యాంగ సంస్థ బాధ్యతలను మీరు నిజాయితీగా నిర్వర్తించాలని అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. ఆయన కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది.

తేజస్వీ యాదవ్ తండ్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 ప్రభుత్వం హాయాంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ లో స్కామ్ జరిగింది. రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని..ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. అనంతరం తేజస్వీ యాదవ్ విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్జేడీ పార్టీ జేడీయూతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.

Exit mobile version