NTV Telugu Site icon

CBI: కార్తీ చిదంబరానికి షాక్‌.. అనుచరుడి అరెస్ట్‌..

Cbi

Cbi

కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది… చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అనుచరుడిని అరెస్ట్‌ చేసింది సీబీఐ.. కార్తీ అనుచరుడైన భాస్కర్ రామన్‌ను చెన్నైలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ.. ఆ తర్వాత అరెస్ట్‌ చేయడం ఆసక్తికంగా మారింది.. మానస పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో వీసా విషయంలో భాస్కర్‌ రామన్‌పై ఆరోపణలు ఉన్నాయి. గత అర్ధరాత్రి వరకు విచారణ తర్వాత రామన్‌ను అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: COVID 19: కరోనా సోకినవారిని పట్టేస్తున్న జాగిలాలు….!

కాగా, 2011లో అక్రమంగా రూ. 50 లక్షలు తీసుకుని 250 మంది చైనా పౌరులకు వీసాలు కల్పించారనే ఆరోపణలపై చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై తాజాగా కేసు నమోదు చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారుల బృందాలు.. చెన్నై మరియు ఢిల్లీలోని కార్తీ చిదంబరం నివాసాలు సహా దేశంలోని పలు నగరాల్లో తనిఖీలు నిర్వహించింది.. పి చిదంబరం అధికారిక నివాసంలో కూడా సీబీఐ బృందం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.