లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చిక్కులు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి గంటల్లో రద్దైంది. ఆప్ ఆశలన్నీ ఈడీ రూపంలో ఆవిరైపోయాయి. తాజాగా కేజ్రీవాల్‌కు మరో చిక్కుచ్చిపడింది. మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. మంగళవారం రాత్రి కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో సీబీఐ విచారించింది. ఇక బుధవారం కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరగా.. మూడు రోజులు అనుమతిచ్చింది. జూన్ 29న రాత్రి 7:00 గంటలలోపు కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని రోస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి అమితాబ్ రావత్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Italy: భారతీయ కార్మికుడి మృతి తీరుపై ప్రధాని మెలోని ఆవేదన.. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన
లిక్కర్ పాలసీ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల పాటు మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ఈడీ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ట్రయల్ కోర్టు మెదడు ఉపయోగించలేదని వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: ‘కల్కి’ సినిమాకు వెళ్తున్నారా.. ఈ విషయాలు మీకు తెలుసా..?
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. ఇక లోక్‌సభ ఎన్నికల కోసం 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: Kenya: మిలటరీ ఆధీనంలో కెన్యా.. 13కు చేరిన మృతుల సంఖ్య