సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరోసారి కేంద్రం పొడిగించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఐ డైరెక్టర్ ఎంపికపై మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. కొత్త డైరెక్టర్‌ను ఎంచుకుంటారంటే… చివరికి ప్రస్తుత డైరెక్టర్ పదవీ కాలాన్నే కేంద్రం పొడిగించింది.
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023 మే 25న రెండేళ్ల పదవీకాలానికి బాధ్యతలు స్వీకరించారు. గతేడాది 2025 మే 24న కూడా ఆయనకు మరోసారి ఏడాది పొడిగింపు మంజూరు చేశారు. తాజాగా 2026 మే 13న కూడా మరో సంవత్సరం పాటు కేంద్రం పొడిగించింది.
