NTV Telugu Site icon

Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్‌లు” ..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత వారం అత్యాచారం హత్యకి గురైన 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ ఘటన దేశంలో ఆగ్రహావేశాలకు కారణమైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను అత్యంతదారుణంగా రేప్ చేసి చంపారు. కాలేజీలోని సెమినార్ హాలులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆస్పత్రిలోనే పోలీస్ సివిల్ వాలంటీర్‌గా పనిచేస్తున్నారడు. ఇతను ఘటన జరిగి రోజు హాస్పిటల్‌లోని పోలీస్ అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు వెళ్లేందుకు యాక్సెస్ ఉంది.

ఈ ఘటనలో డాక్టర్ రాత్రి విధులను ముగించుకుని ఎప్పటి లాగే సెమినార్ హాలులో నిద్రపోయింది. అయితే, తెల్లవారు శుక్రవారం ఆమె అదే ప్రదేశంలో విగతజీవిగా, నగ్నంగా, ఒంటిపై తీవ్రగాయాలతో పడిఉంది. ఘటనాస్థలంలో నిందితుడికి సంబంధించిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ లభించింది. దీంతో సంజయ్ రాయ్ నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

Read Also: Bengaluru: పార్టీ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థిని.. లిఫ్ట్ ఇచ్చి రేప్ చేసిన బైకర్..

ఈ కేసుని ఇప్పటికే కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఇదిలా ఉంటే నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు అనుమతితతో బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్, నార్కో అనాలిస్ వంటి పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధమైంది. మరోవైపు ఇతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు సీబీఐ ‘‘ సైకలాజికల్ టెస్టు’’ని నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు కోర్టు అనుమతి అవసరం లేదు. ఈ పరీక్ష నిర్వహించేందుకు నిన్న కోల్‌కతాకు ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ వైద్యుల బృందం చేరుకుంది. ముందుగా వీరు సంజయ్ రాయ్‌ని ప్రశ్నించనున్నారు. మరోవైపు బాధితురాలి మృతదేహం లభించిన సెమినార్ హాలు నుంచి ఆధారాలు సేకరించడానికి సీబీఐ ఫోరెన్సిక్ టీం మూడో రోజు కూడా ఆర్జీకర్ ఆస్పత్రిలోనే ఉంది.

సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్‌లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో, దర్యాప్తు సంస్థ బృందం రాయ్ వాయిస్‌ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు, అంటే లై-డిటెక్టర్ పరికరం, దాని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు.