NTV Telugu Site icon

Toll fee: దారుణం.. టోల్ ఫీజు ఎగొట్టడానికి సిబ్బందిని తొక్కించుకుంటూ వెళ్లిన బస్సు..

Toll

Toll

Toll fee: టోల్ ఫీజు ఎగ్గొట్టడానికి ఓ బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. టోల్ ప్లాజాలో ఆపకుండా వేగంగా బస్సుని నడిపాడు. బస్సుని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టోల్ సిబ్బందిలో ఒకరిని బస్సుతో తొక్కించాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఘమ్రోజ్ ప్లాజా వద్ద జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. టోల్ గేట్ గుండా ముందుగా ఓ కార్ వెళ్లింది. ఆ తర్వాత హర్యానా రోడ్ వేస్‌కి చెందిన బస్సు ఆపకుండా టోల్ గేట్ దాటేందుకు డ్రైవర్ వేగంగా నడిపాడు. ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.