Maharashtra: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహరాష్ట్రాలోని కొల్హాపూర్‌లో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు వేగానికి సదరు వ్యక్తి గాలిలోకి ఎగిసిపడ్డాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Read Also: Pakistan: పాక్‌కి సాయం చేయొద్దని చెప్పినా పెంటగాన్ వినలేదు.. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు..
రోహిత్ సఖారం హప్పే అనే 24 ఏళ్ల వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో హప్పే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉన్నప్పటీ, వెనక నుంచి వచ్చిన కారు హప్పేని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆగస్టు 28న జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడి తలకు, రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఇంకా డ్రైవర్‌ని గుర్తించలేదు. గుర్తుతెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీ కెమెరాలనను స్కాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
https://twitter.com/gharkekalesh/status/1829777866554229108
