Site icon NTV Telugu

Viral Video: కళ్లముందు మనీ హీస్ట్ సీన్.. రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం

Noida Viral Viedo

Noida Viral Viedo

మనీ హీస్ట్ వెబ్ సిరీస్ తెలియని వారుండరు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా నోట్ల కట్లలే తయారు చేయిస్తాడు హీరో. అయితే ఇందులో హీరో హెలికాప్టర్ నుంచి రోడ్డుపై నోట్ల వర్షం కురిపించిన సీన్.. తాజాగా రియల్ లైఫ్‌లోనూ దర్శనం ఇచ్చింది. అదేక్కడో కాదు మన ఇండియాలోనే. నోయిడాలో అర్థరాత్రి రోడ్డుపై కొందరు యువకుడు నోట్ల వర్షం కురిపించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో దీనిపై పోలీసుల కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఉత్తప్రదేశ్‌లోని గౌతమ్‌బుధ్ నగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు సమాచారం ప్రకారం.. రోడ్డుపై కాన్వాయ్ సిరీస్ కార్లు వరుసగా వెళుతున్నాయి. అందులోని ఓ కారు రూఫ్ టాప్ నుంచి యువకులు కరెన్సీ నోట్లు వెదజల్లుతూ వెళ్లారు. నోయిడా సిటీలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపై కాన్వాయ్ సిరీస్‌కు సంబంధించిన కొన్ని వాహనాలు వరసగా వెళ్లాయి. సెక్టార్-37 నుంచి సిటీ సెంటర్ వైపు అవి వెళ్తున్నాయి. అందులో ఓ వాహనంలో యువకులు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి గట్టి అరుస్తూ నోట్లు వెదలజల్లుతూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడున్న కొందరు సెల్‌ఫోన్ల వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది కాస్తా పోలీసుల కంటపడటంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ ప్రాంతాలను నుంచి కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒక్కొ కారుపై రూ. 33 వేలు చలాన్ వేసినట్టు సీనియర్ పోలీసు ఆఫీసర్ తెలిపారు. అయితే ఆ యువకులు వెదజల్లిన నోట్లు నిజమైన నోట్లా లేక నకిలివా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆ విధంగా విచారణ చేపట్టినట్టు తెలిపారు. అలాగే వారిపై ట్రాఫీక్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Exit mobile version