NTV Telugu Site icon

AAP MLA Dinesh Mohaniya: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

Dinesh

Dinesh

AAP MLA Dinesh Mohaniya: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో ఆప్‌ ఎమ్మెల్యే దినేష్‌ మోహానియా ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. సదరు మహిళకు ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆప్‌ నేతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Read Also: Shriya Saran : చీరకట్టులో చెక్కిన శిల్పంలా శ్రియా శరణ్‌..

అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఆప్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో ర్యాలీలో ఓ మహిళతో ఆయన అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చూస్తూ సైగలు చేశారు. ఆ తర్వాత ఆమెకు ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడంతో.. ఎమ్మెల్యే తీరుపై ఆ‍గ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళ.. తాజగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

Read Also: Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం

ఇక, ఎన్నికల ర్యాలీలో దినేష్ మోహానియా ఇచ్చిన ఫ్లయింగ్‌ కిస్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆయనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అలాగే, సంగం విహార్ నుంచి మూడు సార్లు శాసన సభ్యుడిగా మోహానియా విజయం సాధించారు. ఆయన మరోసారి తన నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఇక, ఈ వివాదాలు దినేష్ కు కొత్తేమీ కాదు.. గత ఏడాది కూడా తన నియోజకవర్గంలోని రోడ్డు పక్కన పండ్ల వ్యాపారితో దురుసుగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదు అయింది.