Case Filed On TVK Chief: నటుడు విజయ్‌కి షాక్.. కేసు పెట్టిన పోలీసులు..
- టీవీకే చీఫ్ విజయ్ కి షాక్ ఇచ్చిన అభిమాని..
- తనపై విజయ్ బౌన్సర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు..
- విజయ్ తో పాటు 10 మంది బౌన్సర్లపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case Filed On TVK Chief: సినీ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay)పై కేసు నమోదు అయింది. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. దళపతి విజయ్ ని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని అతడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు.
Read Also: Sena Tho Senani: ‘సేనతో సేనాని’.. నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
టీవీకే పార్టీ రెండో వార్షిక సమావేశం సందర్భంగా మధురైలో ఏర్పాటు చేసినా మహాసభ వేదికగా ప్రత్యేకంగా భారీ ర్యాంప్ నిర్మించారు. దళపతి విజయ్ ర్యాంప్‌పై నడుస్తూ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయనను కలిసేందుకు కొంతమంది అభిమానులు ర్యాంప్‌పైకి ఎక్కారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని కిందకు తోసేశారు బౌన్సర్లు.
పెరంబలూరు జిల్లా, పెరియమ్మాపాళయం గ్రామానికి చెందిన శరత్‌కుమార్ అనే అభిమాని దళపతి విజయ్ ని కలిసేందుకు ర్యాంప్‌పైకి ఎక్కాడు. ఈ సమయంలో విజయ్ బౌన్సర్లు అతనిని గట్టిగా పట్టుకొని కిందికి విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అభిమాని శరత్‌కుమార్, ఆయన తల్లి సంతోషం ఇద్దరూ మదురై జిల్లా అదనపు ఎస్పీ బాలమురుగన్కి ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా విజయ్ తో పాటు 10మంది బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!