Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు

Vaddha

Vaddha

ఉత్తరాఖండ్‌ను మరోసారి వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో హరిద్వార్‌లో పెద్ద ఎత్తున ప్రవాహం ప్రవహించింది. దీంతో కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి. శ్మశాన వాటికలో ఆగి ఉన్న బస్సులు, ఎనిమిది కార్లు కొట్టుకుపోయాయి.

ఇది కూడా చదవండి: Delhi rain: విషాదం.. డ్రైనేజీలో ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యం

రుతుపవనాలు ఉత్తరాఖండ్‌లో విస్తరించాయి. దీంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నీటి మట్టాలు పెరిగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని మైకుల ద్వారా పోలీసులు సూచించారు. స్థానికులెవరూ నది దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Sri Lanka: ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత.. కారణమేంటంటే..!

 

Exit mobile version