Site icon NTV Telugu

Car Stuck in Flyover: ఫ్లై ఓవర్ గ్యాప్ లో ఇరుక్కున్న కారు.. రక్షించిన స్థానికులు

Untitled Design (3)

Untitled Design (3)

కేరళలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేషనల్ హైవే -66 పై పూర్తిగా నిర్మాణం కానీ ఫైఓవర్ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ లో కారు ఇరుక్కుపోయింది. కేరళ కన్నూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. తలస్సేరి-కన్నూర్‌ మార్గంలో నిర్మాణం పూర్తికాని ఫ్లైఓవర్‌పైకి ఎక్కిన కారు మధ్యలో ఉన్న పెద్ద గ్యాప్‌లో పడిపోయింది. దీంతో కొద్దిసేపు కారు గాల్లోని ఉంది. అక్కడున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ ను బయటికి తీశారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Fitness Exercises: గ్రామాల్లో చేసే పనులతో.. జిమ్ లో మహిళలకు ట్రైనింగ్

అయితే.. తలస్సేరి నుంచి కన్నూర్‌ దిశగా వెళ్తున్న కారు, హెచ్చరిక ఉన్న బారికేడ్లను దాటి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లింది. ఫ్లైఓవర్‌ రెండు సెక్షన్ల మధ్య పనులు కాలేదు.. డ్రైవర్ అలాగే ముందుకు పోనివ్వడంతో కారులో గ్యాప్ లో ఇరుక్కుని వేళాడుతూ ఉంది. డ్రైవర్‌ బారికేడ్లను గమనించకపోవడంతో.. ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో రక్షణ చర్యలు చేపట్టి డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also:Lowest Temperature: వణికిస్తున్న ‘చలి పులి’.. 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు..

ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం డ్రైవర్ ఓవర్ స్పీడ్… తొందరపాటు వల్లే ప్రమాదం జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిర్మాణ ప్రదేశాల్లో స్పష్టమైన బోర్డులు, రిఫ్లెక్టివ్‌ మార్కర్లు, బలమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సోషల్‌ మీడియాలో విస్తృతంగా డిమాండ్‌ చేస్తున్నారు.

Exit mobile version