Site icon NTV Telugu

వైరల్ : పంజాబ్‌లోని కారు డ్రైవర్ హల్‌చల్…

పంజాబ్‌లోని పాటియాలా న‌గ‌రంలో ఓ కారు డ్రైవ‌ర్ చేసిన ప‌ని స్థానికుల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. రెగ్యుల‌ర్ విధుల్లో భాగంగా పాటియాలాలో పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వ‌స్తున్న ఓ కారును కానిస్టేబుల్ ఆపే ప్రయ‌త్నం చేశాడు. ఐతే కారు డ్రైవ‌ర్ ఆప‌కుండా కానిస్టేబుల్ మీదకు దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ త‌ప్పుకునేందుకు ప్రయ‌త్నించినా అవ‌కాశం ఇవ్వకుండా ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. తోటి పోలీసులు ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. ఓ కారు డ్రైవ‌ర్ త‌నిఖీ నుంచి త‌ప్పించుకునేందుకు త‌మ పోలీస్‌ను ఢీకొట్టి కారుతో ప‌రార‌య్యాడ‌ని, ఆ కారును ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని పాటియాలా డీఎస్పీ హేమంత్ శ‌ర్మ చెప్పారు. కేసుకు సంబంధించి త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు.

Exit mobile version