సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ బయల్దేరిందంటే.. గమ్యం చేరుకునేవరకు ఎక్కడా ఆగే పరిస్థితి ఉండదు.. ఇక, అర్ధరాత్రి సమయంలో అయితే.. ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి.. కానీ, కొన్నా సార్లు తోటివారికి సాయం చేసి మానత్వం చాటుకున్న ముఖ్యమంత్రులు కూడా లేకపోలేదు.. ఇప్పుడా కోవలో చేరిపోయారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ లగ్జరీ కారులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో.. అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కాన్వాయ్.. అక్కడ ఆపారు.. బాధితుడితో మాట్లాడారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Power Cut: యూపీలో పవర్ కట్స్.. వైద్యులకు మొబైల్ టార్చిలైటే దిక్కైంది..!
ముంబైలోని ఉత్తర-దక్షిణ ప్రధాన రహదారి అయిన హైవేపై విలే పార్లే ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు. అర్ధరాత్రి 12.25 గంటలకు కారులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక శాఖకు ఫోన్ వచ్చింది. రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు. అదే సమయంలో.. ఎదురుగా రోడ్డు గుండా వెళుతున్న ముఖ్యమంత్రి షిండే కాన్వాయ్ ఆగింది.. కారు మంటల్లో చిక్కుకుని కన్నీరు మున్నీరవుతున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లిన సీఎం షిండే.. మంటల్లో చిక్కుకున్న కారు దగ్గరకు వెళ్లవద్దని సూచించారు.. కారు కంటే ప్రాణం ముఖ్యమన్న ఆయన.. తిరిగి వెళ్లిపోయే ముందు.. తాము సాయం చేస్తామని కారు కోల్పోయిన బాధితుడికి భరోసా ఇచ్చారు.
