NTV Telugu Site icon

Captain Anshuman Singh: “కీర్తిచక్ర”తో స్మృతి సింగ్ ఆస్ట్రేలియా పారిపోవాలని ప్లాన్.. అమరవీరుడి తండ్రి ఆరోపణ..

Smriti Singh

Smriti Singh

Captain Anshuman Singh: గతేడాది సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కి మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర ప్రకటించింది. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి జూలై 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. వీర సైనికుడి భార్యపై సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత తమ కోడులు తమను వదిలిపెట్టి ‘కీర్తి చక్ర’తో వెళ్లిపోయిందని, తమకు తమ కొడుకు ఫోటో మాత్రం గోడపై మిగిలిందని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా అన్షుమాన్ సింగ్ తండ్రి తన కోడులు స్మృతి సింగ్ తన కొడుకు కీర్తి చక్ర, ఎక్స్‌గ్రేషియా డబ్బుతో పారిపోవాలని యోచిస్తుందని ఆరోపించారు. దేశం విడిచి ఆస్ట్రేలియా వెళ్లాలని భావిస్తుందని ఆయన అన్నారు. ప్రేమ పేరుతో తన కొడుకుని మోసం చేసిందని ఆరోపించారు. ఆమె తన కొడుకును ప్రేమించలేదని అన్నారు.

Read Also: Dubai Princess: దుబాయ్‌ యువరాణి సంచలన ప్రకటన.. విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడి

ఇటీవల, స్మృతి సింగ్ మాట్లాడుతూ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కెప్టెన్ అన్షుమాన్‌తో తన మొదటి కలయికలోనే ప్రేమ చిగురించిందని చెప్పారు. తన కొడలు కొడుకు బట్టలు, ఫోటో ఆల్బమ్స్, శౌర్య పురస్కారాన్ని తీసుకెళ్లిందని అమరవీరుడి తల్లిదండ్రులు ఆరోపించిన కొద్ది రోజులకే ఈ ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ అన్షుమాన్ తండ్రి కూడా సైన్యంలోని ‘నెక్స్ట్ ఆఫ్ కిన్'(NOK) చట్టాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. ఆర్మీలో ఉన్న వ్యక్తికి ఏదైనా జరిగితే, ఆస్తులకు ఎవరు వారసత్వం పొందుతారనే విషయాలను ఈ చట్టం నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి సైన్యంలో చేరితే వివాహం కాకముందు తల్లిదండ్రుల్ని NOKగా పరిగణిస్తారు. పెళ్లి తర్వాత భార్యని పరిగణిస్తారు.