NTV Telugu Site icon

Supreme Court: బుల్డోజర్ చర్యలపై మండిపడ్డ సుప్రీంకోర్టు

S

S

గత కొద్ది రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో నిందితుల ఇళ్లపై బుల్డోజర్లతో ఆస్తులను ధ్వంసం చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. సోమవారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బుల్డోజర్ చర్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై బుల్డోజర్ చర్యలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతూ.. ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణం చూపించి కూల్చివేతలను ఎలా చేపడతారని నిలదీసింది. ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తెలినప్పటికీ చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా అతని ఆస్తిని కూల్చివేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Abhishek singhvi: దేశంలో గవర్నర్ వ్యవస్థను పూర్తి రద్దు చేయాలి

ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా మారే అక్రమ కట్టడాలను తాము రక్షించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి పాన్-ఇంండియా బేసిసిలో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయవచ్చని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. నిందితుడు అయినందున ఎవరి ఇంటినైనా ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఈ అంశంపై మార్గదర్శకాలను రూపొందించాలని ప్రతిపాదిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Devara: టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!