NTV Telugu Site icon

Canadian Sikh MP: భారత్‌పై ఆంక్షలు, ఆర్ఎస్ఎస్‌పై బ్యాన్.. కెనడియన్ సిక్కు ఎంపీ కామెడీ..

Canada

Canada

Canadian Sikh MP: ఇండియా, కెనడాల మధ్య దౌత్యయుద్ధం జరగుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గతేడాది సర్రే నగరంలోని గురుద్వారా వద్ద కాల్చి చంపారు. అయితే, ఈ ఘటనలో భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంపై వివాదం చెలరేగింది. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడింది. సిక్కు ఓట్ల కోసం భారత్‌ని టార్గెట్ చేస్తున్న విషయం అర్థమైంది. ఇదిలా ఉంటే, ఇండియా కెనడాలోని తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్‌లోని కెనడా రాయబారుల్ని శనివారం లోగా దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే, ఖలిస్తాన్‌కి గట్టి మద్దతుదారు, ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కెనడియన్ సిక్క్ ఎంపీ జగ్మీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఎగతాళి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా మొత్తం నవ్వుకుంది. భారత రాయబారులు, భారతదేశంపై ఆంక్షలు విధించాలని జగ్మీత్ సింగ్ డిమాండ్ చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి మరియు కెనడియన్ నాయకులుగా మనమందరం ఏకం కావాలి. మనమందరం (PM నరేంద్ర) మోడీని ఖండించడంలో ఐక్యంగా ఉండాలి, కెనడియన్ల భద్రతకు అన్నింటి కన్నా ముఖ్యం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

ఇంతటితో ఆగకుండా కెనడియన్ సిక్కులు భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, భారత దౌత్యవేత్తల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని, కెనడాలో ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేయాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చాడు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఓ విలేకరి జోక్యం చసుకుంటూ.. భారతదేశంపై ఆంక్షలు విధిస్తే కెనడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెప్పాడు. దీంతో జగ్మీత్ సింగ్.. కెనడా కేవలం భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మాటమార్చాడు. జగ్మీత్ వ్యాఖ్యలపై సదరు రిపోర్టర్ మాట్లాడుతూ.. మీకు వ్యూహాత్మకమైన విధానం అవసరమంటూ ఎగతాళి చేశాడు.

పరిస్థితి తన కంట్రోల్‌లో లేదనుకన్న జగ్మీత్ సింగ్ అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. ఆయనను ఎగతాళి చేస్తూ ‘‘అతను వెళ్లిపోయాడు.. అతను వెళ్లిపోయాడు’’ అని మాట్లాడుకోవడం వినవచ్చు. అంతకుముందు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా భారత్‌పై ఆంక్షలు విధించడాన్ని చర్చిస్తున్నట్లు చెప్పారు.