Site icon NTV Telugu

భవానీపూర్‌ ఉప ఎన్నిక.. నిరాకరించిన హైకోర్టు..

సెప్టెంబర్ 30న జరగనున్న భవానీపూర్‌ ఉప ఎన్నికను నిలిపివేయడానికి నిరాకరించింది కలకత్తా హైకోర్టు.. ఈ ఉప ఎన్నిక విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌ ఉపఎన్నికల ప్రక్రియపై భారత ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా.. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ రాజర్షి భరద్వాజ్ లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

కాగా, మే 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుండి ఓడిపోయిన మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు మార్గాన్ని సులభతరం చేయడానికి ఎన్నికైన అభ్యర్థి రాజీనామా చేయడం ద్వారా ఉప ఎన్నికల ఖర్చులను ప్రజలు భరించాలా వద్దా అనే రెండవ సమస్యను నవంబర్‌ 9వ తేదీన వింటామని హైకోర్టు పేర్కొంది. కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దానిని నిరాకరించింది హైకోర్టు..

Exit mobile version