దేశవ్యాప్తంగా ఆరు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 2026 అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాల కారణంగా ఈ స్థానాలన్నీ ఖాళీ అయ్యాయి.
ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు
మదురాంతకం (తమిళనాడు)
ధారపురం (తమిళనాడు)
తట్టంచవాడి (పుదుచ్చేరి)
రాజ్‌నగర్ (పశ్చిమ బెంగాల్)
నందిగ్రామ్ (పశ్చిమ బెంగాల్)
లోక్‌సభ స్థానం: నాగావ్ (అస్సాం)
ఉప ఎన్నికల పూర్తి షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల తేదీ: 09 సెప్టెంబర్ 2026
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2026
నామినేషన్ పత్రాల పరిశీలన: సెప్టెంబర్ 17, 2026
ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 19, 2026
ఎన్నికల తేదీ: 06 అక్టోబర్ 2026
లెక్కింపు తేదీ: అక్టోబర్ 9, 2026
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ: అక్టోబర్ 11, 2026
ఉప ఎన్నికలు ఎందుకు?
ప్రజాప్రతినిధుల రాజీనామాల కారణంగా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నాగావ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడు ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామా చేయడంతో అస్సాంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరో ఐదు అసెంబ్లీ స్థానాల నుంచి కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తమిళనాడులోని మదురాంతకం స్థానం నుంచి ఎమ్మెల్యే మరగాతం కుమారవేల్, ధారపురం నుంచి పి. సత్యభామ రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని రేజినగర్ నుంచి ఎమ్మెల్యే హుమాయున్ కబీర్, నందిగ్రామ్ నుంచి గుజరాత్ సీఎం సువేందు అధికారి రాజీనామా చేశారు. ఇది కాకుండా పుదుచ్చేరిలోని తట్టంచవాడి స్థానం నుంచి ఎమ్మెల్యే ఎన్. రంగస్వామి రాజీనామా చేశారు. దీంత ఉప ఎన్నిక అనివార్యమైంది.

