NTV Telugu Site icon

Kerala: పొరపాటున యువకుల అకౌంట్లలోకి రూ. 2 కోట్లు.. ఇక ఆ తర్వాత చూసుకో..

Bank Cheating

Bank Cheating

By mistake Rs. 2 crores credited in accounts.. incident in kerala: పొరపాటున బ్యాంకు తప్పిదాల వల్ల కొన్నిసార్లు అకౌంట్లలో కోట్ల కొద్ది డబ్బు కనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు చాలా సార్లు చూశాం. అయితే కొద్ధి సేపట్లోనే బ్యాంకులు తమ తప్పిదాలను సరిదిద్దుకుంటున్నాయి. సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇదిలా ఉంటే కేరళలో ఓ ఘటన జరిగింది. బ్యాంకు పొరపాటు వల్ల ఇద్దరు యువకుల ఎకౌంట్లలో ఏకంగా రూ. 2.44 కోట్ల డబ్బులు జమయ్యాయి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ లో జరిగింది.

Read Also: Droupadi Murmu: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతిముర్ము పర్యటన.. స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం

అరింబూర్ కు చెందిన నిధిన్, మను ఖాతాల్లో కోట్లలో డబ్బు జమకావడంతో ఇక విలాసాలకు అలవాటు పడ్డారు. ఖరీదైన ఫోన్లు, వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు కొంత డబ్బును షేర్ మార్కట్లో ఇన్వెస్ట్ చేశారు. మరికొంత డబ్బును లోన్లు కట్టుకోవడానికి వాడుకున్నారు. మిగిలిన డబ్బును 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు ట్రాన్స్పర్ చేశారు. ఆలస్యంగా మేలుకున్న బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల ఖాతా ఉన్న బ్యాంకు మరో బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో సర్వర్లలో సమస్యలు ఏర్పడి ఇలా జరిగిందా..? లేకపోతే నిందితులు సర్వర్లను మార్చడం ద్వారా ఇలా చేశారనే దానిపై విచారణ సాగుతోంది.

Show comments