NTV Telugu Site icon

Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 22 మందితో వెళ్తూ లోయలో పడిన బస్సు

Mussoorie Accident

Mussoorie Accident

Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ముస్సోరీ డెహ్రాడూన్ మార్గంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముస్సోరీ డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా షేర్‌ఘాడీ సమీపంలో 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.

Read Also: Maoist letter: మావోయిస్టు లేఖ కలకలం.. ఎమ్మెల్యేకి బెదిరింపులు

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. లోయలో పడిపోయిన బాధితులను బయటకు తీసుకు వస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇండో-టిబెటియన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) సహాయక కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన 19 మందిని డెహ్రాడూన్ తరలించారు.