NTV Telugu Site icon

Maharashtra: హైవేపై బైకర్ నిర్లక్ష్యం.. తప్పించబోయి బస్సు బోల్తా.. వీడియో వైరల్

Maharashtrabusbike

Maharashtrabusbike

ఓ బైకర్ నిర్లక్ష్యం కారణంగా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. హైవేపై బస్సు వేగంగా దూసుకొస్తోంది. ముందున్న బైక్.. సడన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక బస్సు డ్రైవర్.. బైకిస్టుల ప్రాణాలు కాపాడేందుకు వేరే రూట్‌లోకి పోనిచ్చాడు. అంతే ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. అందులో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన బైకర్‎పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బైకర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా బండి నడిపి బస్ ప్రమాదానికి కారణమైన బైకర్‎పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.