NTV Telugu Site icon

Bullet Train Start: ఢిల్లీ నుండి ఈ మూడు నగరాలకు బుల్లెట్ రైలు.. ఛార్జీలు ఎంతంటే?

Bullet Train

Bullet Train

Bullet Train Start: దేశంలో బుల్లెట్ రైలు ప్రవేశంపై ప్రయాణికులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ రైలు) పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని పని 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ముంబై నుండి అహ్మదాబాద్‌తో పాటు దేశంలోని మూడు ప్రధాన నగరాలు కూడా బుల్లెట్ రైలు కనెక్టివిటీ ద్వారా అనుసంధానించబడతాయి. రాబోయే కాలంలో దేశంలోని న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో బుల్లెట్ రైలు కనెక్టివిటీ ఉంటుంది.

Read Also:TTD Meeting: టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలివే..!

నాలుగు మార్గాల్లో హైస్పీడ్ కారిడార్
ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో.. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఆపరేషన్స్ డైరెక్టర్ రాజేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. RVNL న్యూఢిల్లీ నుండి కోల్‌కతా, న్యూఢిల్లీ నుండి ముంబై, ముంబై నుండి చెన్నై వరకు హై-స్పీడ్ కారిడార్ ఆవశ్యకతను వ్యక్తం చేసింది. మీరు హైస్పీడ్ కారిడార్ భవిష్యత్తును చూడాలనుకుంటే.. మనకు న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా అనే నాలుగు ప్రధాన మెగా నగరాలు ఉన్నాయని ఆయన అన్నారు. రానున్న కాలంలో నాలుగు మార్గాల్లో హైస్పీడ్ కారిడార్లను నిర్మించబోతున్నామని తెలిపారు.

Read Also:Zero Electricity Bill: ఈ లైట్‌ను పెట్టుకుంటే ఎలాంటి ఖర్చు ఉండదు

ఫైనాన్సింగ్ మోడల్‌పై కూడా పని చేశామని, ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. హైస్పీడ్ రైళ్ల డైమండ్ క్వాడ్రిలేటరల్ నెట్‌వర్క్ కోసం ప్రభుత్వం ‘సాధ్యాసాధ్యాల అధ్యయనం’ చేపట్టింది. ఇందులో ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై, చెన్నై-కోల్‌కతా, కోల్‌కతా-ఢిల్లీలను ఢిల్లీ-చెన్నై, ముంబై-కోల్‌కతాతో అనుసంధానించే మార్గాలపై చర్చలు జరిగాయి. ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు వచ్చే ఐదు నుంచి పదేళ్లలో మార్గం ప్రారంభం కానుందని కూడా ప్రసాద్ చెప్పారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అనేది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) 100% అనుబంధ సంస్థ. ప్రస్తుతం ఇది ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులను పూర్తి చేస్తోంది.

ఛార్జీలపై కూడా చర్చ జరిగింది.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో బుల్లెట్ రైలు ఛార్జీల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ అది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. బుల్లెట్ రైలు ఛార్జీలకు ఏసీ కంపార్ట్ మెంట్ ఆధారంగా ఉంటాయన్నారు. ఇవి సాధారణ రైలుతో పోల్చుకుంటే 1.5రెట్లు ధర అధికంగా ఉండనున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించే ఛార్జీలు ఫస్ట్ ఏసీ రేంజ్ లో ఉంటాయని ఊహించవచ్చు.

Show comments