Site icon NTV Telugu

Uttarpradesh: ఉత్తమ దంపతులు.. షాపులో భార్యభర్తల చేతివాటం..

Untitled Design (2)

Untitled Design (2)

ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ లో ఓ జంట చేసిన దొంగతనం ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డీఎం కాలనీ రోడ్‌లో ఉన్న గౌరవ్ పండిట్ జ్యువెల్లర్ షాప్‌కు భార్య భార్తలిద్దరూ వచ్చారు. ఖరీదైన ఆభరణాలు చూపించడమని అడగడంతో… సిబ్బంది.. ఓనర్ నగలు చూపించే పనిలో పడ్డారు. దీంతో ఎంచక్కా వారు తమ చేతివాటం ప్రదర్శించారు భార్యాభర్తలు..

దుకాణదారుడు స్టాక్ తనిఖీల ముగింపు సమయంలో ఆరు గ్రాముల బంగారం తక్కువగా ఉండడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నెక్లెస్‌లను చూస్తుండగా, ఆ మహిళ చాకచక్యంగా ఒక నెక్లెస్‌ను తన చీర కింద పెట్టుకుని తన స్నేహితుడితో కలిసి దుకాణం నుండి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైంది. పోయిన బంగారు నెక్లెస్ విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని.. జ్యువెలరీ షోరూమ్ యజమాని గౌరవ్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంటను త్వరలో గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version