Site icon NTV Telugu

Budget 2024-25: Budget 2024-25: కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి రూ.15 వేలు..!

Employeement

Employeement

Budget 2024-25: 2024- 25 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. వరుసగా ఏడోసారి ఆమె బడ్జెట్ ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మూడో విడత సర్కార్ లో ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త స్కీమ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ ఐదు పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.

Read Also: Budget 2024 : మోడీ మరో కానుక …’పూర్వోదయ’ పథకం ఏపీ, బీహార్ కి కూడా వర్తింపు

మూడు స్కీములు ఇవే..
స్కీమ్‌-A: ఈపీఎఫ్‌వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు 15000 వేల రూపాయల వరకు ఒక నెల జీతం. మూడు విడతల్లో చెల్లింపు చేయాలని తెలిపింది.
స్కీమ్‌- B: మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ ఆధారంగా చెల్లింపులు కొనసాగేలా చర్యలు.
స్కీమ్‌- C: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్ల పాటు 3000 వేల రూపాయల వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ రీయింబర్స్‌మెంట్‌..

Exit mobile version