పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. భారత్- బంగ్లా సరిహద్దులో సైన్యం భారీగా మోహరించింది. దీంతో బీఎస్‌ఎఫ్ హైఅలర్ట్ ప్రకటించింది. గత నెల నుంచి బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరసనకారులు గాయాలు పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Perni Nani: కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు..
భారత్- బంగ్లా సరిహద్దులో 4, 096 కిలోమీటర్ల మేర అదనపు బలగాలను వెంటనే మోహరించాలని బీఎస్‌ఎఫ్ ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్‌ఎఫ్ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. తాజా పరిస్థితులను పర్యవేక్షించేందుకు బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ ఛౌదరి కోల్‌కతా చేరుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Devara 2nd Single: అనిరుధ్ భయ్యా.. పాట మామూలుగా లేదు కానీ?
సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లక్షలాది మంది నిరసనకారులు చేరుకుని ప్రధాని హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఆందోళనకారుల డిమాండ్‌కు తలొగ్గాల్సి వచ్చింది. ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసి విదేశాలకు పరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Wanaparthy: ఆస్తి కోసం తల్లిదండ్రులపై వేధింపులు.. డీజీపీకి ఫిర్యాదు