NTV Telugu Site icon

India-Pak Border: బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని సూసైడ్

Sucide

Sucide

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నివాసి అయిన మృతుడు విధుల్లో ఉన్నప్పుడు తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: JC Prabhakar Reddy Apologies: వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. హాట్‌ టాపిక్‌..!

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఇండో-పాకిస్థాన్ సరిహద్దులో డ్యూటీ నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. షాఘర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బాబు రామ్ మాట్లాడుతూ.. సిబ్బంది అంతా విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని చనిపోయాడన్నారు. తుపాకీ శబ్దం విని సంఘటనా స్థలానికి వచ్చిన సహచరులు అతను స్పందించకపోవడాన్ని గుర్తించారని చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవల్సిన ఇబ్బంది ఏమొచ్చిందని పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Parenting Tips: పిల్లలతో ఇలా ఉంటే చిన్నప్పటి నుండే సక్రమ మార్గంలో పయనిస్తారు

Show comments