Helicopter Faces Landing Issues: టెన్షన్‌ పెట్టిన హెలికాప్టర్‌.. మాజీ సీఎంకు తప్పిన ముప్పు..

Bs Yediyurappa

Bs Yediyurappa

Helicopter Faces Landing Issues: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, కర్నాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడడంతో.. అసలు ఏం జరుగుతుందనే అయోమయం నెలకొంది కాసేపు.. ఆ తర్వాత పైలట్‌ సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీఎస్‌ యడియూరప్ప ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌లో కలుబుర్గికి బయలుదేరి వెళ్లారు.. అయితే, జెవారీలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కావాల్సి ఉంది.. కానీ, ల్యాండింగ్‌ సమయంలో హెలిప్యాడ్‌ పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి.. ఇక, ఆ దుమ్ము, దూలి మధ్యలో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయడం పైలట్‌కు సవాల్‌గా మారిపోయింది.. చేసేది ఏమీలేక.. హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయకుండా.. ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు కాసేపు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హెలిప్యాడ్‌ క్లియర్‌ చేయడంతో.. ఆ తర్వాత హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

Read Also: Vellampalli Srinivas: ఎన్నికల తర్వాత బాబు, పవన్‌, లోకేష్ పనిబడతాం.. వాళ్లు ఏమీ XXలేరు

×
×
Ad

ఇదిలావుండగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, బీజేపీ అనుభవజ్ఞుడైన బీఎస్‌ యడియూరప్పను కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉపయోగించుకుంటుంది.. యడియూరప్ప కలబురగిలో బీజేపీ ‘జన సనకల్ప యాత్ర’లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ప్రమాదం తప్పడంతో.. బీజేపీ శ్రేణులు, యడియూరప్ప అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఎన్నికల ప్రచార సమయంలో.. రోడ్డు మార్గంలో వెళ్తే.. ఎక్కువ సమయం పడుతుంది గనుక.. ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీలు హెలికాప్టర్‌లు వాడడం తరచూ చూస్తూనే ఉంటాం.